రాష్ట్ర అభివృద్ధికై అధికారులతో కేసీఆర్ చర్చలు

SMTV Desk 2017-07-26 11:08:39  delhi, telangana cm kcr, rajnath, arunjaitli

న్యూఢిల్లీ, జూలై 26 :తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని ఆర్థిక హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ ను ముఖ్యమంత్రి కేసీఆర్ కోరారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న కేసీఆర్ మంగళవారం రాజ్ నాథ్ ను కలిసి రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాలపై చర్చించారు. నక్సల్ కు ప్రభావిత ప్రాంతాల్లో రహదారుల అభివృద్ధి కి నిధులు ఇవ్వాలని కోరిన కేసీఆర్ , పోలీసు వ్యవస్థ ఆధునికీకరణకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. పాలన సౌలభ్యం కోసం కొత్త జిల్లాలను ఏర్పాటు చేసినందున ఐఏఎస్, ఐపిఎస్ కొరత ఏర్పడిందని రాజ్ నాథ్ దృష్టికి తీసుకెళ్లారు. అవసరమైన మేరకు అధికారులను తెలంగాణకు కేటాయించాలని కేసిఆర్ కోరారు. హైకోర్టు విభజనను కూడా వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిసింది. నేడు ఆర్థిక రక్షణ మంత్రి అరుణ్ జైట్లీ తో సమావేశం కానున్న కేసీఆర్ ఎఫ్ ఆర్ బీఎం పరిమితి పెంపు, వెనుక బడిన ప్రాంతాల అభివృద్ధికి రావలసిన 450 కోట్ల నిధులు, సచివాలయ నిర్మాణానికి బైసన్ పోలో మైదానం అప్పగింత వంటి అంశాలపై చర్చిస్తారట. అలాగే భారత ప్రధాని నరేంద్ర మోదీని కలిసేందుకు కేసీఆర్ సమయం కోరినట్లు సమాచారం.