అప్పట్లో నేను బ్లాంక్ చెక్ పంపాను

SMTV Desk 2018-12-11 16:57:31  sobhan babu, murali mohan, tollywood

హైదరాబాద్ ,డిసెంబర్ 11 :
తెలుగు తెరపై ఆ తరం లో అందాల కథానాయకుడిగా శోభన్ బాబు సుదీర్ఘ కాలం పాటు వొక వెలుగు వెలిగాడు . ఆయన అభిమానులంతా కలిసి శోభన్ బాబు సేవాసమితి అనే పేరుతో ఈ నెల 25వ తేదీన అవార్డుల ప్రదానోత్సవాన్ని జరిపే సన్నాహాల్లో ఉన్నారు . హైదరాబాద్ లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్ ఇందుకు వేదికగా మారనుంది.

ఈ విషయాన్ని మురళీమోహన్ మీడియాకి తెలియజేసి , మాట్లాడుతూ శోభన్ బాబు గురించిన వొక ఆసక్తికరమైన విషయం చెప్పారు. "శోభన్ బాబు వొక నిర్ణయం తీసుకుంటే ఎలాంటి పరిస్థితుల్లోను దానిని మార్చుకోరు. అలాగే ఆయన వొకసారి ఇక నటించకూడదనే నిర్ణయం తీసుకున్నారు. నేను అతడు సినిమా తీస్తున్నప్పుడు అందులో వొక కీలకమైన పాత్రను శోభన్ బాబు చేస్తే బాగుంటుందని భావించి ఆయనకి బ్లాంక్ చెక్ పంపించాను. అయినా ఆయన దానిని సున్నితంగా తిరస్కరించి తన గొప్పతనాన్ని చాటుకున్నారు" అని చెప్పుకొచ్చారు.