ఓటమి చవిచూసిన రేవంత్..!

SMTV Desk 2018-12-11 15:36:44  Revanth Reddy, KCR, KTR, Telangana Elections, Harish Rao

హైదరాబాద్‌, డిసెంబర్ 11: తెలంగాణ కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, కొడంగల్‌ మహాకూటమి అభ్యర్థి రేవంత్‌రెడ్డి ఘోర ఓటమి పాలయ్యారు. తన ప్రత్యర్థి, తెరాస అభ్యర్థి పట్నం నరేందర్‌ రెడ్డి చేతిలో ఆయన ఓడిపోయారు. తాను ఓటమిపాలైతే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానన్న రేవంత్ ఇప్పుడు ఏంచేస్తారో వేచి చూడాలి. కొడంగల్‌లో తెరాస గెలుపుకోసం ఆ పార్టీ ముఖ్యనేతలంతా రంగంలోకి దిగారు. గ్రామస్థాయి నుంచి కార్యకర్తలతో సమన్వయం చేసుకుంటూ మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్‌, మహేందర్‌రెడ్డి, లక్ష్మారెడ్డి తదితర ముఖ్యనేతలంతా కొడంగల్‌లో విజయం కోసం తీవ్రంగా శ్రమించారు.