మా పై చేసిన ఆరోపణ అవస్తావమంటున్న కేటీఆర్

SMTV Desk 2017-07-25 18:26:44  IT MINISTER KTR, CONGRESS MINISTER JAIRAM, DGSD VIHICLE

హైదరాబాద్, జూలై 25 : తెలంగాణ రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కేటీఆర్ పై కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ చేసిన ఆరోపణలు అవాస్తవమని కేటీఆర్ తెలిపారు. ఈ మేరకు తెలంగాణ భవన్ లో కేటీఆర్ మీడియా తో మాట్లాడుతూ ..”మా ప్రభుత్వం చక్కగా పని చేస్తుంది. విపక్షాలు పని గట్టుకుని మాపై విమర్శలు చేస్తున్నాయని ఆయన తెలిపారు. కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ చిల్లర విమర్శ చేశారని, కానీ పోలీసు శాఖలో వెంకయ్యతో కలిసి కార్లు అమ్మానన్నారు. పోలీసు శాఖలో వాహనాలు ఆధునికీకరణ చేయాలనుకున్నాం. తెలంగాణ 300 ఇన్నోవాలను డిజిఎస్ డి నిర్దారించిన ధరకు కొన్నామన్నారు. డిజిఎస్ డి అనేది కేంద్రం ఏర్పాటు చేసిన సంస్థ డిజిఎస్ డి ధర నిర్ణయించింది కూడా జైరాం కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు టొయోటా కంపెనీ నుంచి కార్లు కొన్నామని అన్నారు. ఇన్నోవా కార్లను ఏ డీలర్ నుంచి కొనలేదు. నాకు ఏడెనిమిది ఏళ్ల కింద ఓ స్పేర్ పార్ట్శ్ డీలర్ షిప్ ఉండేదని కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ రాకముందే దాని నుంచి బయటకు వచ్చా వెంకయ్య కూతురుకు చెందిన ట్రస్టుకు పన్ను మినహాయింపు అన్నారు. జైరాం రమేశ్ ఆరోపణ చేసే ముందు చెక్ చేసుకోవాలన్నారు. గత ప్రభుత్వాలు బోలెడు సంస్థలకు మినహాయింపు ఇచ్చారు. నేను బుదర జల్లుతా మీరు కడుక్కోండి అన్నట్లు ప్రతిపక్షాల తీరు ఉందని” కేటీఆర్ ధ్వజమెత్తారు.