రవి తేజ సినిమాలో మరొక సారి విలన్ పాత్ర చేయనున్న హీరో

SMTV Desk 2018-12-10 17:46:00  madhavan, raviteja

హైదరాబాద్ , డిసెంబర్ 10 : వొకప్పుడు తెలుగు .. తమిళ భాషల్లో కి మంచి ఫాలోయింగ్ ఉన్న హీరో మాధవన్ . విభిన్నమైన .. విలక్షణమైన పాత్రలను పోషించడంలో ఆయన ఎప్పుడూ ముందుంటాడు . ఈ నేపథ్యంలోనే ఆయన విలన్ పాత్రలు చేయడానికి కూడా సై అంటున్నారు. ఇటీవల వచ్చిన సవ్యసాచి సినిమాలో ప్రతినాయకుడిగా ఆయన నటించారు. ఈ సినిమాకి సక్సెస్ లభించకపోవడంతో, ఆయన పాత్రకి రావలసినంత గుర్తింపు రాలేదు.

అయినా నిరాశ పడకుండా ఆయన మరోసినిమాలో విలన్ గా చేసి తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. అమర్ అక్బర్ ఆంటోనీ ఘోరపరాజయం తరువాత రవితేజ వీఐ ఆనంద్ దర్శకత్వంలో చేయనున్న సినిమాలో విలన్ పాత్ర కోసం మాధవన్ ను సంప్రదించగా, ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా సమాచారం. ఈ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ వచ్చేనెలలో సెట్స్ పైకి వెళ్లనున్నట్టు తెలుస్తోంది రామ్ తాళ్లూరి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు . చూద్దాం రవి తేజకి మాధవన్ కి ఈ సరైన విజయం వరిస్తుందో లేదో .