క్రీడా రంగం పై పడనున్న ఇళయ దళపతి

SMTV Desk 2018-12-10 13:15:02  atlee,sarkar,tamil,vijay

చెన్నై డిసెంబర్ 10 : తమిళ అగ్ర హీరో విజయ్ఈ మధ్య కాలంలో వరుస విజయాలను నమోదు చేస్తూ దూసుకుపోతున్నాడు. ఆయన ఈ సినిమాల్లో సందేశంతో వినోదాన్ని జోడించి ఉండేలా చూసుకోవడం విశేషం. వొక్కో సమస్యా , ఆ సమస్యకి తగిన పరిష్కారం వాటి చుట్టూ తిరిగే కథను ఎంచుకునే ఆయన తీరు అందరినీ ఆశ్చర్య పరుస్తోంది. ఈ నేపథ్యంలో వచ్చిన కత్తి .. తుపాకి .. మెర్సల్ .. సర్కార్ సంచలన విజయాలను సాధించాయి.

దాంతో ఆయన తదుపరి సినిమా కూడా అదే పంధాలో ఉండనుంది. విజయ్ తన తదుపరి సినిమాను అట్లీ కుమార్ దర్శకత్వంలో చేయనున్నాడు. ఈ సినిమా క్రీడారంగంలోని రాజకీయాల చుట్టూ తిరుగుతుందట. ఈ సినిమాలో ఆయన వొక క్రీడాకారుడిగా కనిపించనున్నాడు. క్రీడారంగాన్ని రాజకీయాలు ప్రభావితం చేయడం వలన, ప్రతిభ కలిగినవారికి అవకాశాలు ఎలా దూరమవుతున్నాయనేది ఈ సినిమాలో చూపించనున్నారని అంటున్నారు.