అక్కడ ఈ సినిమా 200 కోట్ల మార్క్ ని తాకడం కష్టమే

SMTV Desk 2018-12-10 12:34:47  ROBO2.O,SHANKAR,akshay kumar,bollywood

ముంబై, డిసెంబర్ 10:
తమిళ అగ్ర దర్శకుడు శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన 2.ఓ .. విడుదలైన ప్రతి ప్రాంతంలోను విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది . తెలుగు .. తమిళ ..హిందీ భాషల్లో ఈ సినిమా భారీ వసూళ్లను రాబడుతోంది. ఈ సినిమా హిందీ వెర్షన్ 10 రోజుల వసూళ్లతో 150 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. అనువాద చిత్రాల్లో హిందీలో అత్యధిక వసూళ్లను సాధించిన సినిమా ల్లో 2వ స్థానాన్ని దక్కించుకుంది. ఇక ఈ ఏడాదిలో అత్యధిక వసూళ్లను సాధించిన హిందీ చిత్రాలలో 6వ స్థానాన్ని సొంతం చేసుకుంది.

ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ తరుణ్ ఆదర్శ్ వెల్లడించిన వివరాల ప్రకారం శనివారం పూర్తయ్యేనాటికి ఈ సినిమా హిందీ వెర్షన్ 154.75 కోట్లను వసూలు చేసింది. ఈ సినిమా 200 కోట్ల మార్క్ ని తాకడం కష్టమే ఇప్పటికే హిందీ వర్షన్ వసూళ్లు తగ్గుముఖం పడుతుండటంతో, ఈ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 2.ఓ చిత్రం అక్షయ్ కుమార్ కెరియర్లోనే అత్యధిక వసూళ్లను సాధించిన సినిమాగా నిలవడంపట్ల ఆయన అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.