రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటా : రేవంత్

SMTV Desk 2018-12-10 11:38:15  Revanth Reddy, KCR, KTR, Telangana Elections

కొడంగల్, డిసెంబర్ 10: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో కొడంగల్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజాకూటమి విజయం సాధించబోతోందన్నారు. కొడంగల్‌లో మరోసారి తాను విజయం సాధించబోతున్నట్టు ధీమా వ్యక్తం చేశారు. మాజీ మంత్రి కెటిఆర్‌ కాంగ్రెస్‌ ప్రముఖ నేతలందరికి ఓటమి ఖాయం అని వ్యాఖ్యలు చేయటంపై రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఓటమిపాలైతే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానన్నారు.

తెరాస ప్రభుత్వ కుట్ర కారణంగా రాష్ట్రంలో దాదాపు 20 లక్షల మంది ఓటర్లు ఓటు వేయలేకపోయారన్నారు. అయితే సిఎం కెసిఆర్‌ మాత్రం గజ్వేలోని ఫామ్‌ హౌస్‌లో వొకటి, సిద్ధిపేట మండలం చింతమకడలో మరొకటి కలిపి మొత్తం 2 ఓటరు కార్డులునమోదు చేసుకున్నారని ఆరోపించారు. కేసీఆర్ పై ఎన్నికల కమిషన్‌ అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.