అంతరిక్షం మూవీ ట్రైలర్

SMTV Desk 2018-12-09 17:51:26  Athariksham, Varun tej,anthariksham trailer

హైదరాబాద్, డిసెంబర్ 09 :ఘాజీ మూవీ ఫేమ్ సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, అదితి రావ్ హైదరి, లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన అంతరిక్షం మూవీ ట్రైలర్ ఇవాళే ఆడియెన్స్ ముందుకొచ్చింది. ఘాజీ లాంటి సంచలనమైన హిట్ తర్వాత సంకల్ప్ రెడ్డి తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో అంతరిక్షం సినిమాపై కూడా భారీ స్థాయిలో అంచనాలున్నాయి. అంతేకాకుండా మరోవైపు వరుణ్ తేజ్ కెరీర్‌లో ‘తొలిప్రేమ లాంటి సూపర్ హిట్ తర్వాత వస్తున్న సినిమా కూడా ఇదే కావడం ఈ సినిమాపై అంచనాలు రెట్టింపవడానికి మరో కారణమైంది.

9000 KMPH వేగంతో అంతరిక్షం లోకి దూసుకెళ్ళిన ‘మిహిర అనే శాటిలైట్ చుట్టూ ఈ సినిమా కథ తిరగనుందని టాక్. అంతరిక్షం అనే టైటిల్‌కి 9000 KMPH అనే ట్యాగ్ లైన్ మరింత క్యాచిగా ఉండగా.. అందుకు తగినట్టుగానే ఈ ట్రైలర్ సైతం సినిమాపై మరిన్ని అంచనాలను పెంచింది. ఇందులో వరుణ్‌ తేజ్‌ వ్యోమగామిగా ‘దేవ్‌ పేరుతో కనిపించనున్నారు. ప్రముఖ దర్శకుడు క్రిష్‌ జాగర్లమూడి సమర్పణలో ఫస్ట్ ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై రాజిరెడ్డి, సాయిబాబా ఈ చిత్ర నిర్మాతలు. కాగా ఈ నెల 21న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.