వివాదంలో రష్మి

SMTV Desk 2018-12-09 14:23:02  rashmi, Anchor Rashmi, tirupathi

హైదరాబాద్ , డిసెంబర్ 09 :యాంకర్‌గానే కాకుండా నటిగానూ గుర్తింపు పొందిన ముద్దుగుమ్మ రష్మి. ఆమె ఈ మధ్య పలు ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో కూడా సందడి చేస్తున్నారు. కాగా ఆదివారం తిరుపతిలో జరగనున్న ఓ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రష్మి హాజరు కాబోతున్నారని కొందరు హోర్డింగ్‌ ఏర్పాటు చేశారు. ఈ ఫొటోను చూసిన రష్మి ట్విటర్‌లో స్పందించారు. అసలు ఆ కార్యక్రమ నిర్వాహకులు తనను సంప్రదించలేదని స్పష్టం చేశారు. ‘ఈ ఈవెంట్‌లో నా భాగస్వామ్యం లేదు. నా అనుమతి, ప్రమేయం లేకుండా నా ఫొటోల్ని పెట్టేస్తారు. కార్యక్రమం స్పాన్సర్లు ఎవరైనా తెలిస్తే ఈ వార్త తెలియజేయండి అని రష్మి నెటిజన్లకు చెప్పారు.

దీంతో సదరు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న వ్యక్తి రష్మికి రిప్లై ఇచ్చారు. ‘ఈ కార్యక్రమానికి వచ్చేందుకు మేం రష్మికి అడ్వాన్స్‌ కూడా ఇచ్చాం. ఆమె రావడానికి వొప్పుకున్నారు. కానీ ఇప్పుడు దాన్ని ఖండిస్తున్నారు. నేను ఆమె మేనేజర్‌కు డబ్బులు పంపా.. ఆధారాలు కూడా ఉన్నాయి చూడండి. దీనిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటా అంటూ కొన్ని స్క్రీన్‌ షాట్లు పంపారు. ఆయన మాటలకు రష్మి ప్రతిస్పందించారు. ఏదైనా చెప్పేముందు కాస్త నిజానిజాలు తెలుసుకోవాలని అన్నారు. ఆయన చేస్తున్న వ్యాఖ్యలు అబద్ధాలుగా తేలుతాయని, చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటే అలానే చేయండని చెప్పారు.

దీనికి మరో వ్యక్తి (క్యాస్టింగ్‌ మేనేజర్‌) రష్మికి మద్దతుగా మాట్లాడారు. ఏదైనా ఉంటే ఆమె మేనేజర్‌ సూరి బాబుతో మాట్లాడాలని అన్నారు. రష్మి తాము నిర్వహించిన పలు కార్యక్రమాలకు వచ్చారని, ఆమె చాలా నిబద్ధత కల్గిన వ్యక్తని, తప్పుపట్టొద్దని చెప్పారు. ఆయనకు రష్మి ధన్యవాదాలు తెలిపారు.