‘ఒడియన్’ టీజర్‌ విడుదల

SMTV Desk 2018-12-09 10:30:13  Odiyan Teaser, Mohan lal,

హైదరాబాద్, డిసెంబర్ 09: మలయాళ ప్రముఖ నటుడు మోహన్‌లాల్‌ హీరోగా మలయాళంలో రూపొందిన చిత్రం ‘వొడియన్ . శ్రీకుమార్ మేనన్ దర్శకత్వం వహించారు. ప్రకాశ్‌రాజ్‌, మంజూ వారియర్‌ ప్రధాన పాత్రలు పోషించారు. దగ్గుబాటి క్రియేషన్స్‌ సంస్థ ఈ సినిమాని నిర్మిస్తోంది. ఈ సినిమాను అత్యున్నత సాంకేతిక విలువలతో రూపొందిస్తున్నారు. సూపర్ పవర్స్ కలిగిన విభిన్నమైన పాత్రలో మోహన్ లాల్ కనిపించనున్నారు. ఈ సినిమాలో ఆయన విభిన్నమైన లుక్స్‌లో సందడి చేయనున్నారు. మలయాళంతోపాటు తెలుగులోనూ ఈ సినిమా డిసెంబరు 14న విడుదల కానుంది.

కాగా ఈ చిత్రం తెలుగు టీజర్‌ను‌ శనివారం సాయంత్రం విడుదల చేశారు. ‘వొడియన్‌.. వాడు చీకటి రాజ్యానికి రారాజు అనే డైలాగ్‌తో ట్రైలర్‌ ఆరంభమైంది. ‘ఇప్పుడు నా లక్ష్యం వాడే.. అంటూ ఓ వ్యక్తిని చూపించారు మోహన్‌లాల్‌. ‘ఇంత వరకు నువ్వు నన్ను ఎన్నో రూపాల్లో చూసి ఉంటావు.. నువ్వు చూడని రూపం వొకటి ఉంది.. అని ఆయన చెప్పే డైలాగ్‌ చిత్ర కథపై ఆసక్తిని పెంచింది. ఉత్కంఠ భరితమైన సన్నివేశాలతో ఈ టీజర్‌ను రూపొందించారు.