నా అనుమతి లేకుండా నా ఫోటోని ఎలా ఉపయోగిస్తారు : రష్మీ

SMTV Desk 2018-12-08 14:51:17  Sudigali Sudheer, Rashmi, Jabardasth, Tirupathi Cancer Event

హైదరాబాద్, డిసెంబర్ 8: ఈ టీవీలో ప్రసారం అయ్యే జబర్దస్త్ కామెడీ షో ద్వారా సుడిగాలి సుధీర్ .. యాంకర్ రష్మీ ఎంతో పాపులర్ అయ్యారు. ఈ క్రేజ్ కారణంగా ఈ ఇద్దరూ మరికొన్ని షోలలోను సందడి చేస్తున్నారు. ఈ సందర్బంగా వీరి ఇద్దరికి సంబంధించిన ఫ్లెక్సీ వొకటి తిరుపతిలో ప్రత్యక్షమైంది. క్యాన్సర్ వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి తిరుపతిలో కొందరు వ్యక్తులు ఈ నెల 9వ తేదీన 10k రన్ ను నిర్వహిస్తున్నారు.

ఈ కార్యక్రమంలో సుడిగాలి సుధీర్ .. యాంకర్ రష్మీ పాల్గొంటున్నారు అని ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీపై రష్మీ స్పందించింది. "ఈ కార్యక్రమానికి సంబంధించిన నిర్వాహకులు ఎవరూ ఇంతవరకూ నన్ను సంప్రదించలేదు. ఈ ఈవెంట్ కి నేను వస్తున్నట్లుగా జరుగుతోన్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదు. నిర్వాహకులు వెంటనే నా ఫ్లెక్సీని తొలగించాలి" నా అనుమతి లేకుండా నా ఫోటోని ఎలా ఉపయోగిస్తారు? అని మండిపడ్డారు.