‘కాఫీ విత్ కరణ్’ షోలో ప్రముఖ సినీ హీరోలు

SMTV Desk 2018-12-08 13:54:20  Cofee with Karan, Rajamouli, prabhas, rana daggubati

హైదరాబాద్, డిసెంబర్ 08: ‘బాహుబలి సినిమాతో దర్శకుడు రాజమౌళి, అందులో ప్రధాన పాత్రలు పోషించిన ప్రభాస్, రానాలు దేశవ్యాప్తంగా క్రేజ్ ను సొంతం చేసుకున్నారు. అందుకే ఈ ముగ్గురిని తన పాపులర్ షో కాఫీ విత్ కరణ్ కు ఆహ్వానించాడు ప్రముఖ నిర్మాత, దర్శకుడు కరణ్ జోహార్. సౌత్ సినీ పరిశ్రమ నుండి మొదటగా ఈ షోకు హాజరవుతోంది ఈ ముగ్గురే కావడం విశేషం. ‘బాహుబలి కి తాను సహా నిర్మాత కావడం వలనే కరణ్ జోహార్ వీరి ముగ్గుర్ని ఈ షోకు ఆహ్వానించారు. త్వరలో చిత్రీకరణ జరుపుకోనున్న ఈ షో ద్వారా కరణ్ వీరి ముగ్గురి నుండి ఇప్పటి వరకు ప్రేక్షకులకి తెలియని ఎలాంటి విషయాల్ని బయటకు లాగుతారో చూడాలి.