100 సీట్లు పక్కా: కేటిఆర్‌

SMTV Desk 2018-12-08 12:08:03  KTR, TRS win 100 seats, KCr

హైదరాబాద్, డిసెంబర్ 08:రాష్ట్రంలో పోలింగ్ ముగిసిన తరువాత వివిద మీడియా సంస్థలు తమ తమ సర్వే ఫలితాలను ప్రకటించాయి. వాటిలో చాలా సంస్థలు తెరాస మళ్ళీ అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పాయి. ఎన్నికల ఫలితాలపై కేటిఆర్‌ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ, “తెరాస గెలుపు కోసం గత మూడు నెలలుగా అహోరాత్రులు కష్టపడిన లక్షలాదిమంది తెరాస కార్యకర్తలు, నేతలు అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. వివిద జిల్లాలలో నేతల నుంచి నాకు అందుతున్న సమాచారం ప్రకారం తెరాస 100 సీట్లు గెలుచుకొని ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది. జై తెలంగాణ!” అని మెసేజ్ పెట్టారు.