సర్వేలన్నీ జై కేసీఆర్‌!

SMTV Desk 2018-12-08 11:17:20  Lagadapati Raj Gopal, KCR,

హైదరాబాద్, డిసెంబర్ 08: మునుపెన్నడూ లేనివిధంగా అత్యంత ఆసక్తికరంగా సాగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై వివిద మీడియా సంస్థలు సర్వేలు జరిపి నేడు పోలింగ్ ముగియగానే ఫలితాలు ప్రకటించాయి. వాటిలో న్యూస్-ఎక్స్ సంస్థ తెలంగాణలో హంగ్ ఏర్పడే అవకాశం ఉందని జోస్యం చెప్పగా మిగిలిన దాదాపు అన్ని సర్వేలలో తెరాస విజయం సాధించబోతోందని జోస్యం చెప్పాయి. కానీ వొక్క లగడపాటి రాజగోపాల్ మాత్రం తెరాసకు 35 (±10) స్థానాలు మాత్రమే వస్తాయని ప్రజాకూటమి 65 (±10) స్థానాలు గెలుచుకోబోతోందని చెప్పడం విశేషం.