స్వాతి సంచలన హత్యోదంతం పై ...సినిమా

SMTV Desk 2017-05-31 12:51:17  swathi murder,chennai ,murder in chennai,nungambakam railway station

హైదరాబాద్, మే 31 : యధార్థ ఘటన ఆధారంగా రూపోందించే సినిమాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. అలాంటి నేపధ్యంలోనే సాప్ట్ వేర్ ఉద్యోగి హత్యకేసును తేరకెక్కిస్తున్నారు. చెన్నై నగరం నుంగంబాక్కం రైల్వే స్టేషన్ లో జరిగిన హత్య ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. టెకీ స్వాతి అనే సాప్ట్ వేర్ ఉద్యోగిని అత్యంత దారుణంగా హతమార్చిన ఘటనను ఇంకా దేశం మర్చిపోలేదు. జయశ్రీ ప్రొడక్షన్స్ పతాకం పై టేకి స్వాతి హత్య నైపథ్యంతో తమిళ సినిమా స్వాతి కొలై వళక్కు (స్వాతి హత్య కేసు) పేరుతో రూపొందించారు.చిత్రాన్ని సుబ్బయ్య నిర్మించగా,ప్రముఖ దర్శకులు రమేశ్ సెల్వన్ దర్శకత్వం వహించారు. యదార్థ సంఘటనల ఆధారంగా రూపోందే సినిమాలలో కల్పిత ఘటనలను చేరుస్తారని, అయితే యదార్థ ఘటనలను ఉన్నదున్నట్లుగా తేరకెక్కించామని డైరెక్టర్ రమేశ్ సెల్వన్ వెల్లడించారు. ఈ హత్యకేసుకు సంబంధించి ప్రజలకు తెలియని పలు విషయాలు ఉన్నాయని...అత్యంత ప్రజాదరణ పొందుతుందని ఆశిస్తున్నామని వెల్లడించారు. స్వాతి కొలై వళక్కు చిత్రంలో టెకీ స్వాతి పాత్రలో ఆయిరా నటించగా, స్వాతి హత్య కేసు నిందితుడు రాంకుమార్ పాత్రలో కొత్త నటుడు మనో నటించారు. న్యాయవాది రాంరాజ్ పాత్రలో వెంకటేష్, స్వాతి హత్యకేసు విచారించిన నుంగంబాక్కం పోలీస్ ఇన్స్ పెక్టర్ పాత్రలో అజ్మల్ శంకర్ నటిస్తున్నారు.