సినిమాలకు కమల్ హాసన్ గుడ్ బై

SMTV Desk 2018-12-06 16:02:05  Kamal Hasan, Cineamas, Good Bye,

కమల్ హాసన్ సినిమాలకు గుడ్ బై చెబుతున్నారా.. కొన్నాళ్లుగా ఈ విషయంపై రకరకాల వార్తలు వస్తున్నాయి. కమల్ హాసన్ సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టి తన జీవితం రాజకీయాలకు అంకితం చేయాలని చూస్తున్నారట. ఆయన స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న శభాష్ నాయుడు రిలీజ్ కు రెడీ అవుతుంది. ఆ సినిమా రిలీజ్ చేశాక శంకర్ డైరక్షన్ లో చేస్తున్న ఇండియన్-2 తో సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టే ఆలోచనలో ఉన్నారట కమల్ హాసన్.

చేసిన ప్రతి సినిమాలో ఏదో వొక కొత్తదనం ఉండేలా చూసుకునే కమల్ హాసన్.. ఎన్నో అద్భుతమైన పాత్రల్లో నటించి మెప్పించారు. సొంతంగా పార్టీ పెట్టి పూర్తిస్థాయి రాజకీయాలను చేసే ఆలోచనలో ఉన్న కమల్ హాసన్ సినిమాలు ఇక చాలని అనుకుంటున్నారట. ఇటీవల ఆయన తన సిని రిటైర్మెంట్ గురించి ఎనౌన్స్ చేశారు. శంకర్ డైరక్షన్ లో ఇండియన్ సినిమాకు సీక్వల్ గా ఇండియన్-2 వస్తుంది. ఇండియన్ సినిమాలో మాదిరిగానే అవినీతి, లంచగొండితనం మీద పొరాడే హీరో కథగా ఇండియన్-2 ఉంటుందట. తన రాజకీయ భవిష్యత్తుకి ఉపయోగపడేలా కమల్ ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది.