ముగిసిన చిన్నా విచారణ

SMTV Desk 2017-07-25 15:52:36  art director, chinna, drugs case, kelvin, puri jagannad, sit, Officials

హైదరాబాద్, జూలై 25 : డ్రగ్స్ దర్యాప్తు లో భాగంగా ఈ రోజు ఆర్ట్ డైరెక్టర్ చిన్నా విచారణ ముగిసింది. ఇంతకు ముందు సినీ ప్రముఖుల కంటే చాలా తక్కువ టైం 4 గంటలు మాత్రమే చిన్నాను విచారించారు. 10:30 గంటలకు ప్రారంభమైన ఈ విచారణ 2:30 వరకు జరిగింది. ఈ విచారణ లో సిట్ అధికారులు అడిగిన ప్రశ్నలన్నింటికీ చిన్నా తొందరగా సమాధానాలు చెప్పారని తెలుస్తుంది. ఈ ప్రశ్నలలో ఎక్కువగా పూరి జగన్నాధ్ తో ఎంత కాలంగా సంబంధాలు ఉన్నాయి? ఎటువంటి సంబంధాలు ఉన్నాయి? బ్యాంకాక్ వెళ్లి ఏం చేస్తారు? కెల్విన్ తో ఉన్న సంబంధాలు ఏంటి? కెల్విన్ కాల్ డేటా లో మీ నంబర్ ఎందుకు ఉంది? ఎందుకు అయన తో మాట్లాడాల్సి వచ్చింది? కెల్విన్ తో ఎందుకు సేల్పీ తీసుకున్నారు? అనే ప్రశ్నలన్నింటికీ చిన్నా సమాధానాలు చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం.