కేటీఆర్ ఫోన్ నంబర్ ఇదే : లగడపాటి

SMTV Desk 2018-12-05 15:33:52  Lagadapati Rajagopal, KTR

హైదరాబాద్, డిసెంబర్ 5: కేటీఆర్‌ తనతో చేసిన వాట్సాప్ చాట్‌ను బయటపెట్టిన లగడపాటి రాజగోపాల్. అంతటితో ఆగకుండా కేటీఆర్ ఫోన్ నంబర్, వాట్సాప్ నంబర్‌ను కూడా మీడియా ముందుకు తెచ్చారు. 8096699999 నంబర్ నుంచి తనతో కాంటాక్ట్ అయ్యారని, 9490866666 నంబర్ నుంచి కేటీఆర్ తనతో వాట్సాప్‌లో చాటింగ్ చేశారని లగడపాటి పేర్కొన్నారు. సర్వే రిపోర్టులు పంపిచడానికి కేటీఆర్‌ మెయిల్‌ అడ్రస్‌ కూడా ఇచ్చారన్నారు.

కేటీఆర్‌ 23 నియోజకవర్గాలలో సర్వే జరిపించమని కోరారు, నేను 37 నియోజకవర్గాల సర్వే జాబితా పంపాను అన్నారు. 37 నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ ఆధిక్యంలో ఉందని తెలిపాను. 'మీ నాన్న గారు పాడు చేసిన వాతావరణాన్ని.. మీరు బాగు చేశారని' కేటీఆర్‌కు మెసేజ్‌ చేశా నని లగడపాటి అన్నారు.కాంగ్రెస్‌, టీడీపీ, సీపీఐ, కోదండరాం కలిస్తే పోటాపోటీగా ఉంటుందని కూడా కేటీఆర్‌కు చెప్పానని తెలిపారు. వీలుంటే పొత్తులతో వెళ్లాలని చెప్పాను.. కానీ కేటీఆర్‌ సింగిల్‌గానే వెళ్తామని చెప్పారని ఆయన తెలిపారు.