వైరల్ అవుతున్న కేటిఆర్ ట్వీట్

SMTV Desk 2018-12-05 13:30:14  KTR, Lagadapati,

హైదరాబాద్, డిసెంబర్ 05: తెలంగాణలో ఎన్నికల హీట్ ని లగడపాటి రాజగోపాల్ వొక్క సారిగా పెంచేశాడు..తెలంగాణలో తనకొచ్చిన ఇబ్బంది ఏముంది లే అనుకున్నాడో ఏమో కాని మొత్తానికి లగడపాటి చివరి నిమిషంలో పెద్ద బాంబే పేల్చాడు. మొత్తం సీట్లు “హస్త” గతం అయ్యేది కూటమికే అంటే డబ్బా కొట్టేశాడు దాంతో వొక్క సారిగా తెలంగాణలో అలజడి రేగింది, పార్టీలలో అయోమయం మొదలయ్యింది..ప్రజలో క్లారిటీ మిస్ అయ్యింది అయితే వీటన్నిటికి తెలంగాణ మంత్రి కేటిఆర్ వొకే వొక్క ట్వీట్ తో చెక్ పెట్టారు..దాంతో లగడపాటి సర్వే తుస్సు మంది.మాజీ ఎంపీ లగడపాటి చెప్పిన జోస్యం లో ఎలాంటి నిజాలు లేవని ఇందంతా బాబు కోసం లగడపాటి చేసిన మ్యాజిక్ అని కేటిఆర్ కొట్టిపారేశారు..ఆయన పెట్టిన వొకే వొక్క ట్వీట్ తో కూటమికి దిమ్మ తిరిగిపోయింది.లగడపాటి తన సర్వేలో వెల్లడైన ఫలితాలను తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు చేసిన వొత్తిడికి నిదర్శనమని అన్నారు..ఏపీలో తనకి ఎక్కడ పొగబెట్టి మరీ తోక్కుతాడో అంటూ తీవ్రంగా భయపడిన లగడపాటి బాబు కి అనుకూలంగానే మార్కులు వేశారని అన్నారు.