ఓ ముఖ్యనేత ఓడిపోనున్నారు: లగడపాటి

SMTV Desk 2018-12-05 12:47:24  Lagadapati Rajagopal, KCR

హైదరాబాద్, డిసెంబర్ 5: గజ్వేల్ నియోజకవర్గంలో ఓ ముఖ్యనేత ఓడిపోనున్నారు, కానీ ఆయన పేరు నేను చెప్పను అని లగడపాటి రాజగోపాల్ ఈరోజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేసారు. అక్టోబర్ 28 నేను గజ్వేల్ వెళ్ళాను, అప్పుడు పోలీసులు తనిఖీలు చేపడుతున్నారు. నన్ను కిందకి దిగాలని కోరారు నేను కిందకి దిగి అక్కడి రాజకీయ పరిస్థితిగురించి అడిగి తెలుసుకున్నాను. వారు ఆయన పోతారు సార్ అన్నారు, అక్కడ ఉన్నవారిలో ఓ కీలక అధికారి కూడా ఉన్నారు.

వారునన్ను గుర్తుపట్టరు అనుకున్నాను, కానీ గుర్తుపట్టి నాతో సెల్ఫీలు తీసుకున్నారు అని చెప్పారు. లగడపాటి చేసిన ఈ వ్యాఖ్యలతో గజ్వేల్ నియోజకవర్గంపై ఉత్కంఠం నెలకొంది. గజ్వేల్ నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ పోటీచేస్తున్నారు.