రాష్ట్రపతిగా తొలి ట్వీట్ చేసిన కోవింద్

SMTV Desk 2017-07-25 13:41:37  president ramnath kovindh twits , twitter, parlament central hall

న్యూఢిల్లీ, జూలై 25 : దేశ ప్రథమ పౌరుడిగా రామ్‌నాథ్‌ కోవింద్‌ ప్రమాణస్వీకారం చేశారు. పార్లమెంట్‌ సెంట్రల్‌హాల్‌లో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జె.ఎస్‌. ఖేహర్‌ ఆయన చేత మధ్యాహ్నం 12:15 గంటలకు ప్రమాణం చేయించారు. అతిరథ మహారథుల సమక్షంలో భారత ప్రథమ పౌరుడిగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా కోవింద్‌ ట్విట్టర్‌లో తన తొలి ట్వీట్‌ చేశారు. ‘భారతదేశానికి 14వ రాష్ట్రపతిగా ప్రమాణం చేయడం గొప్ప గౌరవంగా భావిస్తున్నా. నా బాధ్యతల్ని వినయ విధేయతలతో నిర్వహిస్తాను’ అని రామనాథ్ కోవింద్ తన తొలి ట్వీట్‌లో పేర్కొన్నారు.