ఏం తప్పుచేసాడని రేవంత్ ని అరెస్ట్ చేసారు : హైకోర్టు

SMTV Desk 2018-12-04 16:16:36  Revanth Reddy, kcr , High Court,Congress, TRS,

హైదరాబాద్, డిసెంబర్ 4: కాంగ్రెస్ నేత కొడంగల్ మహాకూటమి అభ్యర్థి రేవంత్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. దీనిపై కొడంగల్ కాంగ్రెస్ నేత నరేందర్ రెడ్డి ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. న్యాయస్థానం రేవంత్ రెడ్డిని ఏ కారణంగా అదుపులోకి తీసుకున్నారో చెప్పాలని పోలీసులని ఆదేశించింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగసభ కారణంగా రేవంత్ కొడంగల్ బంద్ కు పిలుపునిచారు అని, నగరంలో శాంతిభద్రతల దృష్ట్యా ఆయనను అరెస్ట్ చేసాము అని పోలీసు అధికారులు చెప్పారు.

దీనిపై స్పందించిన న్యాయస్థానం బంద్‌కు రేవంత్‌ పిలుపునిస్తే తప్పుఏముంది. ఆయనను అదుపులోకి తీసుకొని ఏ నేరాన్ని నమోదుచేసారు అని పోలీసులను ప్రశ్నించింది. ఇంటెలిజెన్స్‌ సమాచారం నివేదిక ఆధారంగానే రేవంత్‌ను అరెస్టు చేశామని పోలీసులు చెప్పగా.. ఆ నివేదిక ఏంటో, దానిలో ఏముందో ఆ వివరాలను తమ ఎదుట ఉంచాలని ఆదేశిస్తూ అందుకు అరగంట సమయం ఇచ్చింది. అనంతరం కేసును సాయంత్రం 4.30 గంటలకి వాయిదా వేసింది.