ఆ సినిమా లో ఫైట్స్ ఉండవట.

SMTV Desk 2018-12-04 15:35:40  Cinema, Multi starrer, f2, fun and frsutration

హైదరాబాద్, డిసెంబర్ 4: మల్టీస్టారర్ ట్రెండ్ కొనసాగుతున్న ఈ టైంలో విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ కలిసి చేస్తున్న క్రేజీ మల్టీస్టారర్ ఎఫ్-2 (ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్) దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాను సక్సెస్ ఫుల్ డైరక్టర్ అనీల్ రావిపుడి డైరెక్ట్ చేస్తుండటం విశేషం. సంక్రాంతికి రిలీజ్ ప్లాన్ చేస్తున్న ఈ సినిమాలో అసలు ఫైట్స్ ఉండవని అంటున్నారు. సినిమా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఫుల్ మూవీ కామెడీతో కడుపుబ్బా నవ్విస్తారట.

వెంకీకి తమన్నా, వరుణ్ తేజ్ కు మెహ్రీన్ జోడీ కడుతున్న ఈ మూవీకి దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ సినిమా రష్ చూసిన దిల్ రాజు పక్కా సంక్రాంతి సూపర్ హిట్ అంటున్నాడట. వెంకటేష్ మార్క్ కామెడీ టైమింగ్ తో ఈ మూవీ వస్తుందని తెలుస్తుంది. మరి వెంకీ, వరుణ్ ల అల్లరికి బాక్సాఫీస్ ఎలా సందడి చేస్తుందో చూడాలి.

ఇప్పటికే సంక్రాంతి బరిలో రాం చరణ్ వినయ విధేయ రామ, బాలకృష్ణ ఎన్.టి.ఆర్ మూవీ రిలీజ్ ఫిక్స్ చేశారు. మరి ఆ రెండు సినిమాల మధ్యలో ఎఫ్-2 ఎలాంటి పోటీ ఇస్తుందో చూడాలి.