టైటిల్ తోనే అంచనాలు పెంచిన కళ్యాణ్ రామ్

SMTV Desk 2018-12-03 13:15:15  kalyan ram,nandamuri,nkr,tdp,tollywood

హైదరాబాద్ డిసెంబర్ 3 : నందమూరి కళ్యాణ్ రామ్ , జయాపజయాలు లెక్కచెయ్యకుండా కేవలం సినిమాల మీద అభిరుచితో స్వయం గా తానే నటిస్తూ , నిర్మిస్తూ కొత్త వాళ్ళని ప్రోత్సహించే హీరోల్లో వొకడు . చాల అపజయాల తరువాత "పటాస్" సినిమాతో మళ్ళీ గాడిలో పడినట్లు అనిపించినా "నా నువ్వే లాంటి" ప్రయోగం చేసి చేతులు కాల్చుకున్నాడు , ఆ తరువాత వచ్చిన "ఎం యల్ ఏ " కొంత మేరకు పర్వాలేదనిపించింది .

తాజాగా ఈ నందమూరి వారసుడు ప్రముఖ సినిమాటోగ్రఫర్ కేవీ గుహన్ దర్శకత్వంలో , వొక సినిమా చేస్తున్నాడు , ఆ సినిమా కి "118" అనే పేరుని ఖరారు చేసారు . అంతే కాదు ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఇప్పటికే రిలీజ్ చెయ్యగా ,


ఈ రోజు టైటిల్ ఉన్న పోస్టర్ ని కళ్యాణ్ రామ్ తన ట్విట్టర్ ద్వారా విడుదల చేసారు . ఈ ఫస్ట్ లుక్‌లో కళ్యాణ్ రామ్ 8 అంకెలో ఉన్న ఫోటో చాలా అట్రాక్టివ్‌గా ఉంది.

ఈచిత్రంలో నివేదా థామస్, షాలినీ పాండేలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. "నా నువ్వే" సినిమాని నిర్మించిన ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లోనే ఈ సినిమాను కూడా వస్తుంది . మహేష్ కోనేరు నిర్మాత గా వ్యవహరిస్తున్నారు .

‘118 అనే టైటిల్ వెనక ఉన్న రహస్యం ఏంటో మున్ముందు చూడాలి .