కేసీఆర్‌ ఏక్ నంబరీ..కేటిఆర్‌ దస్ నంబరీ

SMTV Desk 2018-12-02 12:05:09  KCR, Ktr, Kavitha,

హైదరాబాద్, డిసెంబర్ 02 :సినీ నటి, తమిళనాడు కాంగ్రెస్‌ నేత కుష్బూ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ, “తెరాస ఎన్నికల గుర్తు కారు. ఆ కారులో ఐదుగురికి మాత్రమే చోటుంటుంది. ఆ ఐదుగురూ కేసీఆర్‌ కుటుంబ సభ్యులు. వెనుక డిక్కీలో కూడా చోటుంటుంది. కానీ దానిలో డబ్బు మూటలు నిండి ఉంటాయి,” అని ఛలోక్తి విసిరారు.

కేసీఆర్‌: కొండా మురళీ గుండానా? వొక్క తొక్కు తొక్కితే పాతాళానికి పోతాడు.

కేసీఆర్‌: రాహుల్ గాంధీ ఓ రాజకీయ జోకర్...మోడీకి తెలివి లేదు...బాబుకు ఎప్పుడూ పక్క చూపులే!

కేటిఆర్‌: బాబు ఇక్కడ రాజకీయాలలో వేలు పెడితే మేము అక్కడి (ఆంధ్రప్రదేశ్) రాజకీయాలలో వేలు పెడతాము.

కేటిఆర్‌: ఆ గట్టునుంటారా... ఈ గట్టునుంటారా?

కవిత: మాకు సొంత ఇల్లు లేదు అద్దె ఇంట్లో ఉంటున్నాము.

హరీష్ రావు: శనీశ్వరుడు కావాలా... కాళేశ్వరం ప్రాజెక్టు కావాలా?

రాహుల్ గాంధీ: కేసీఆర్‌ అంటే కమీషన్ కావ్ రావు.

రాహుల్ గాంధీ: బిజెపికి బి టీం తెరాస, సి టీం మజ్లీస్

కేంద్ర మంత్రి రవిశంకర్: రాహుల్ ఓ అయోమయ గాంధీ!

చంద్రబాబు: ఏం తమ్ముళ్లూ కేసీఆర్‌ గుండెల్లో రైళ్ళు పరిగెత్తిద్దామా?

చంద్రబాబు: అక్కడ పెద్ద మోడీ.. ఇక్కడ చిన్న మోడీ!

ఉత్తమ్ కుమార్ రెడ్డి: కేసీఆర్‌కు ఇంకా 6 రోజులే మిగిలుంది.

మందకృష్ణ: అన్నం పెట్టినోడికే కేసీఆర్‌ సున్నం పెడతాడు.

కోదండరామ్‌: కేసీఆర్‌ క్రికెట్ పోటీలో ‘గాయపడిన బ్యాట్స్ మ్యాన్ ఆయన ఆట పూర్తయిపోయింది.

కోదండరామ్‌: గెలిచినా, ఓడినా ఫాం హౌసులో పడుకొంటాననేవాడికి ఓట్లు ఎందుకు?

విజయశాంతి: కేసీఆర్‌ మాయల మరాఠీ.

మధూ యాష్కీ: కేసీఆర్‌ ఏక్ నంబరీ..కేటిఆర్‌ దస్ నంబరీ

గూడూరు నారాయణ రెడ్డి(టీపీసీసీ కోశాధికారి): హైదరాబాద్‌ను డల్లాస్ లా కాదు డర్టీ సిటీగా మార్చారు.

సండ్ర వెంకటవీరయ్య: కొడుకు కోసమే సిరిసిల్లా జిల్లా ఏర్పాటు.

సుహాసిని: ప్రజలకు సేవ చేయడానికే పోటీ చేస్తున్నా!

బిజెపి: వొక్క ఛాన్స్ ప్లీజ్!