2.ఓ సినిమా లీక్

SMTV Desk 2018-12-01 15:48:10  2.o cinema, rajinikanth 2.o leak

హైదరాబాద్, డిసెంబర్ 01: శంకర్, రజినికాంత్ కాంబినేషన్ లో 600 కోట్ల భారీ బడ్జెట్ తో వచ్చిన సినిమా 2.ఓ. రోబో సీక్వల్ గా వచ్చిన ఈ సినిమా గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాలో ప్రతినాయకుడిగా అక్షయ్ కుమార్ నటించారు. ఇక ఈ సినిమాను రిలీజైన రోజే హెచ్.డి ప్రింట్ లీక్ చేస్తామని చెప్పిన తమిళ రాకర్స్ అన్నంత పని చేశారు. గురువారం మధ్యాహ్నమే 2.ఓ హెచ్.డి ప్రింట్ తమిళ్ రాకర్స్ ఆన్ లైన్ లో రిలీజ్ చేశారు.రిలీజ్ ముందు తమిళ్ రాకర్స్ చేసిన ప్రకటనకు చిత్రయూనిట్ ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. అంతేకాదు కోర్ట్ లో పిటీషన్ కూడా వేశారు. ఇన్ని చేసినా తమిళ్ రాకర్స్ 2.ఓ హెచ్.డి ప్రింట్ ఆన్ లైన్ లో రిలీజ్ చేయడం జరిగింది. మరి దీనిపై దర్శక నిర్మాతలు కఠిన చర్యలు తీసుకోవాలని చూస్తున్నారు.

ఇక సినిమా టాక్ విషయానికొస్తే రోబోతో పోల్చుకుంటే 2.ఓ కథ పరంగా స్ట్రాంగ్ గా చెప్పలేకపోయాడు శంకర్. విజువల్స్ పరంగా సినిమా సూపర్ అనిపించుకుంది. రజిని చరిష్మా చాటేలా 2.ఓ అన్ని చోట్ల పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.