ట్రిపుల్ ఆర్ నుండి మరో సర్ ప్రైజ్..

SMTV Desk 2018-12-01 13:51:40  Triple r, Rrr, Rajamouli

హైదరాబాద్, డిసెంబర్ 01: బాహుబలితో సంచలన విజయం అందుకున్నదిగ్గజ దర్శకుడు రాజమౌళి ఆ సినిమా తర్వాత కొద్దిపాటి గ్యాప్ తో ఆ సినిమాను మించే కాంబినేషన్ తో సినిమా మొదలుపెట్టాడు. యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్, మెగా పవర్ స్టార్ రాం చరణ్ కలిసి చేస్తున్న ఈ మల్టీస్టారర్ సినిమా ట్రిపుల్ ఆర్ అంటూ ఎనౌన్స్ చేసి అంచనాలు పెంచాడు. 11-11-11 నాడు సినిమా ముహుర్తం పెట్టిన రాజమౌళి సినిమా నుండి మరో సర్ ప్రైజ్ 12-12-12 నాడు రివీల్ చేస్తున్నాడట.

12వ తారీఖు 12 గంటల 12 నిమిషాలకు ట్రిపుల్ ఆర్ నుండి మరో బిగ్ ఎనౌన్స్ మెంట్ రాబోతుందని అంటున్నారు. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న ఈ సినిమాలో మొడట్లోనే భారీ యాక్షన్ సీన్స్ షూట్ చేస్తున్నాడట రాజమౌళి. పిరియాడికల్ మూవీగా రాబోతున్న ఈ సినిమా లో హీరోయిన్స్ ఎనౌన్స్ చేస్తాడని కొందరు అంటుంటే.. సినిమా కాన్సెప్ట్ తెలిపేలా పోస్టర్ ఏదైనా రిలీజ్ చేస్తాడా అంటున్నారు కొందరు. మరి రాజమౌళి సర్ ప్రైజ్ ఏంటో చూడాలంటే ఆరోజు దాకా వెయిట్ చేయాల్సిందే.