లగడపాటిది వెకిలి మకిలి సర్వే.. : కేసీఆర్

SMTV Desk 2018-12-01 13:33:29  kcr,trs,Lagadapati Rajagopal,congress,

హైదరాబాద్, డిసెంబర్ 01: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులు సత్తా చాటుతారని విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ చెప్పడంపై ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ విరుచుకుపడ్డారు. లగడపాటి సర్వే ఓ వెకిలి మకిలి సర్వే అని, అలాంటివన్నీ చెత్త అని విమర్శించారు. కేసీఆర్ ఈ రోజు భూపాలపల్లిలో జరిగిన సభలో మాట్లాడారు.

‘తెలంగాణ ఉద్యమ సమయంలోనూ కొందరు సన్నాసులు శాపాలు పెట్టారు. సర్వేలు అని లీకులు ఇచ్చారు. అదంతా చెత్త. అవన్నీ వెకిలి మకిలి సర్వేలు. జనం ఆగొం కావొద్దు. లగడపాటి సర్వేకు జనం భారీగా తరలి వచ్చిన ఈ సభే సరైన సమాధానం.. అని అన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి మధుసూదనాచారి లక్ష మెజారిటీతో గెలుస్తారని చెప్పారు.

ఈ రోజు తిరుమల వెంకన్నను దర్శించుకున్న రాజగోపాల్.. తెలంగాణలో ఈసారి 8 నుంచి 10 మంది ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలుస్తారని, రోజుకు ఇద్దరి పేర్లు వెల్లడిస్తానని చెప్పారు. మహబూబ్‌నగర్‌ జిల్లానారాయణపేట్‌లో స్వతంత్ర అభ్యర్థి శివకుమార్‌, ఆదిలాబాద్‌ జిల్లా బోథ్‌లో స్వతంత్ర అభ్యర్థి అనిల్‌ జాదవ్‌లు‌ గెలవబోతున్నారని అన్నారు.