2.ఓ లో చిన్న ట్విస్ట్

SMTV Desk 2018-12-01 11:29:54  robo 2.o , super star Rajinikanth,

హైదరాబాద్, డిసెంబర్ 01: రోబో సీక్వల్ గా వచ్చిన 2.ఓ సినిమా భారీ బడ్జెట్ తో భారీ అంచనాలతో వచ్చింది. శంకర్, రజిని కాంబో మూవీ అంచనాలకు తగినట్టుగా వచ్చిన ఈ సినిమా మొదటి రోజు 100 కోట్ల దాకా కలక్షన్స్ వసూళు చేసిందని అంటున్నారు. ఇక ఈ సినిమాలో యంతర లోకపు సుందరివే సాంగ్ సినిమా ముగిశాక చివర టైటిల్స్ ట్రోల్ అవుతుంటే వేశారు. ఆ సాంగ్ కు అయిన ఖర్చు ఎంతంటే అక్షరాల 20 కోట్లు.

అంత ఖర్చు పెట్టి తీసిన ఆ సాంగ్ ఎందుకు అలా చివరన పెట్టారో అని ఆడియెన్స్ ఫీల్ అయ్యారు. అయితే ప్రేక్షకుల కోరిక మేరకు ఈ సాంగ్ ను సెకండ్ ఆఫ్ లో యాడ్ చేశారట. సినిమా అయ్యాక ఇదేదో ప్రమోషనల్ సాంగ్ అనుకుని సీట్లలోంచి ప్రేక్షకులు వెళ్లిపోతున్నారు. అంత బడ్జెట్ తో తీసిన ఈ సాంగ్ ను ఇప్పుడు ఎంజాయ్ చేసే అవకాశం ఉంది. ఈ సాంగ్ రీప్లేస్ మెంట్ తో సినిమా మరింత వసూళ్లు సాధిస్తుందేమో చూడాలి.