కాన్సర్ బారినపడ్డ మరో సెలెబ్రెటీ

SMTV Desk 2018-11-29 17:50:31  AYUSHMAN,THAHIRA,BOLLYWOOD

ఈమద్య కాలంలో సెలబ్రెటీలు క్యాన్సర్ బారిన పడిన వార్తలు ఎక్కువ గానే వింటున్నాం . ప్రస్తుతం బాలీవుడ్ హీరోయిన్ సోనాలి బింద్రే క్యాన్సర్ తో పోరాడుతూ అమెరికాలో క్యాన్సర్ కు చికిత్స తీసుకుంటున్న విషయం మనకి తెల్సిందే . తాజాగా మరో సెలబ్రెటీ కూడా తనకు క్యాన్సర్ అంటూ ప్రకటించింది. బాలీవుడ్ హీరో ఆయుష్మాన్ ఖురానా భార్య తహీరా కశ్యప్ తనకు క్యాన్సర్ ఫస్ట్ స్టేజ్ లో ఉందని ప్రకటించింది.
సోషల్ మీడియాలో ఈ విషయమై సుదీర్ఘ పోస్ట్ చేసింది. అందులో తహీరా కశ్యప్ "ఇది నాకు చాలా కఠినమైన సమయం అయినా నేను ధైర్యంగా ఈ పరిస్థితిని ఎదుర్కొంటాను. ఇలాంటి పరిస్థితుల్లో ఎంతో మంది ఉన్నారు. మొదటి సారి టెస్టు చేయించుకున్న సమయంలో క్యాన్సర్ స్టేజ్ జీరోలో ఉందని జాగ్రత్తలు తీసుకుంటే అదుపు చేసుకోవచ్చని సూచించారు. కాని ఈ మహమ్మారి ముదిరి పోయి స్టేజ్ వన్ కు చేరింది. అయినా కూడా ధైర్యం కోల్పోనని ఆయుష్మాన్ మరియు నా స్నేహితులకు మాట ఇస్తున్నాను. ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నాను. ఇప్పటికే ఆరు సెషన్స్ పూర్తి అయ్యాయి " అంటూ పోస్ట్ చేసింది.

విక్కీ డోనర్ చిత్రంతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి మల్టీ ట్యాలెంటెడ్ అనిపించుకునిన్న ఆయుష్మాన్ ఖరానా ప్రస్తుతం హిందీ సినీ పరిశ్రమలో వరుసగా చిత్రాలు చేస్తూ బిజీ హీరోగా ఉన్నాడు. ఆయుష్మాన్ 2011వ ఏడాదిలో తహీరాను వివాహం చేసుకున్నాడు. వీరిద్దరు చాలా అన్యోన్యంగా ఉంటారు. అంతా సాఫీగా సాగుతున్న సమయంలో ఇలాంటి షాకింగ్ పరిణామాలు చోటు చేసుకోవడంతో ఆయుష్మాన్ సన్నిహితులు మరియు అభిమానులు ఆవేదన వ్యక్తంచేస్తూ తహీరా ఆరోగ్యం బాగుండాలని అంతా కోరుకుంటున్నారు.