మోదీకి దమ్ముంటే నిరూపించాలి - కేసీఆర్

SMTV Desk 2018-11-27 16:20:15  Modi, KCR, Prime Minister modi

నిజామాబాద్‌ , నవంబర్ 27: విద్యుత్‌పై చర్చకు రావలంటూ ప్రధాన మంత్రి మోడికి సీఎం కెసిఆర్‌ సవాల్‌ విసిరారు. ఈరోజు మహబూబ్‌నగర్‌ జిల్లాలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో కెసిఆర్‌ మాట్లాడుతు మోడితో ఎక్కడైనా చర్చకు సిద్ధమని అన్నారు. నిజామాబాద్‌ అభివృద్ధిపై కూడా చర్చకు సిద్ధమని ఆయన సవాల్‌ చేశారు. తెలంగాణలో విద్యుత్ సమస్య ఎక్కడిది అని ప్రశ్నించారు. మోడి ఇంత తెలివితక్కువ ప్రధాని అని అనుకోలేదని విమర్శించారు. ప్రధాని మోడి అసత్యాలు మాట్లాడటం సరికాదని కెసిఆర్‌ వ్యాఖ్యానించారు.

ప్రధాని మోదీ నిజామాబాద్ సభలో పచ్చి అబద్ధాలు మాట్లాడారని మండిపడ్డారు కేసీఆర్. ‘మోదీ నిజామాబాద్ వచ్చారంట.. అక్కడ ప్రజలు కరెంట్, మంచినీళ్లు ప్రజలు ఇబ్బంది పడుతున్నారని అన్నారట. నరేంద్ర మోదీకి ఛాలెంజ్ చేస్తున్నా.. హెలికాప్టర్ ఎక్కి నిజామాబాద్ వస్తా.. ఆయన రావాలి. ఇద్దరం కలిసి సభ పెడదాం.. కరెంట్, నీళ్లకు ప్రజలు ఇబ్బంది పడుతున్నారేమో అడుగుదాం. ప్రజలు ఏం చెబుతారో చూద్దాం.. సమస్యలు లేవని ప్రజలు చెబితే ప్రధాని పదవికి రాజీనామా చేస్తారా అని సవాల్ విసిరారు కేసీఆర్.