ఒత్తిడిలో శ్రీను వైట్ల

SMTV Desk 2018-11-26 18:03:39  Srrenu Vaitla, amar akbar anthony

హైదరాబాద్ , నవంబర్ 26:శ్రీను వైట్ల, రవితేజ కాంబినేషన్ లో ఈమధ్యనే వచ్చిన సినిమా అమర్ అక్బర్ ఆంటోని. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా శ్రీను వైట్ల బ్యాడ్ లక్ ను కొనసాగిస్తుంది. కథ, కథనాలు ఏవి ప్రేక్షకులను మెప్పించలేదు. అందుకే ప్రేక్షకులు ఈ సినిమాను తిప్పికొట్టారు. అయితే ఈ సినిమా మీద ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్న శ్రీను వైట్ల మాత్రం రెమ్యునరేషన్ కూడా తీసుకోకుండా లాభాల్లో వాటా తీసుకుంటానని చెప్పాడట.

అసలైతే మైత్రి మేకర్స్ రెమ్యునరేషన్ గా 4 కోట్లు ఇద్దామని అనుకున్నారట. కాని శ్రీను వైట్ల పారితోషికం వద్దని సినిమాకు వచ్చే లాభాల్లో వాటా ఇవ్వమని అన్నాడట. అయితే సినిమా షూటింగ్ టైంలో తన ఖర్చులు మొత్తం నిర్మాతలే పెట్టుకోవాలని చెప్పాడట. అలా చేతికి రావాల్సిన డబ్బుని వద్దనుకున్నాడు శ్రీను వైట్ల. మైత్రి మూవీ మేకర్స్ ముందే సినిమాను అమ్మేసుకోవడం వల్ల వారికి పెద్దగా లాస్ లేదట. అయితే ప్రాఫిట్స్ ఏమి లేవు కాబట్టి శ్రీను వైట్లకు రెమ్యునరేషన్ ఇచ్చేది లేదు. అలా శ్రీను వైట్ల అమర్ అక్బర్ ఆంటోని సినిమా ఫ్రీగా చేయాల్సి వచ్చింది.