ఉగ్రదాడి వివరాలిస్తే రూ.35 కోట్లు: అమెరికా

SMTV Desk 2018-11-26 17:26:35  America, Mumbai attacks, donald trump

అమెరికా , నవంబర్ 26: 2008లో ముంబయిలో జరిగిన ఉగ్రదాడికి కుట్ర పన్నిన వారి గురించి సమాచారం చెప్పితే 5 మిలియన్‌ డాలర్ల రివార్డు ఇస్తామని అమెరికా ప్రకటించింది. పాకిస్థాన్‌ ఉగ్రవాద సంస్థ లష్కరే తొయిబాకు చెందిన పది మంది ఉగ్రవాదులు ముంబైలో ప్రవేశించి నాలుగు రోజుల పాటు మారణహోమానికి పాల్పడ్డారు. నాటి ఉగ్రదాడిలో 166 మంది ప్రాణాలు కోల్పోగా, 300 మంది వరకు గాయపడ్డారు. వీరిలో ఆరుగురు అమెరికా పౌరులు సైతం ఉన్నారు. ఉగ్రదాడికి పాల్పడిన, కుట్ర పన్నిన, సహాయ పడిన, దాడికి ప్రేరేపించిన వారి వివరాలు ఏవైనా తెలియజేస్తే వారికి 5 మిలియన్‌ డాలర్లు(దాదాపు రూ.35 కోట్లు ) రివార్డుగా ఇస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ యంత్రాంగం వెల్లడించింది