రామ్ చరణ్ vs సాయి కుమార్

SMTV Desk 2018-11-25 13:39:29  ram charan, sai kumar, vinaya vidheya rama

హైదరాబాద్, నవంబర్ 25: భరత్ అనే నేను సినిమా తర్వాత మహేష్ వంశీ పైడిపల్లి డైరక్షన్ లో వస్తున్న సినిమా మహర్షి. దిల్ రాజు, అశ్వనిదత్ కలిసి ఈ సినిమా నిర్మిస్తున్నారు. పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో అల్లరి నరేష్ కూడా ఇంపార్టెంట్ రోల్ లో నటీస్తున్నాడని తెలిసిందే. మహేష్ మూడు డిఫరెంట్ షేడ్స్ లో కనిపించే ఈ మహర్షి సినిమాలో విలన్ గా సాయి కుమార్ నటిస్తున్నారట. కొన్నాళ్లుగా క్యారక్టర్ ఆర్టిస్టుగా నటిస్తున్న సాయి కుమార్ మహర్షి కోసం మళ్లీ విలనిజం చూపిస్తున్నారట.

వంశీ పైడిపల్లి డైరక్షన్ లో రాం చరణ్ హీరోగా చేసిన ఎవడు సినిమాలో కూడా సాయి కుమార్ విలన్ గా నటించాడు. ఇప్పుడు అదే దర్శకుడు చేస్తున్న మహర్షిలో కూడా ఈ యాక్షన్ హీరో విలన్ గా కనిపించనున్నాడు. ఈమధ్య సాయి కుమార్ అన్ని సపోర్టింగ్ రోల్స్ చేస్తూ వచ్చారు. ప్రతినాయకుడిగా మరోసారి సాయి కుమార్ మరోసారి సత్తా చాటడం ఖాయమని అంటున్నారు చిత్రయూనిట్.

దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో సాంగ్స్ అదిరిపోతాయట. 2019 ఏప్రిల్ 5 ఉగాది సందర్భంగా మహర్షి సినిమా రిలీజ్ అవుతుంది. సినిమా నుండి వచ్చిన టీజర్ వొక్కటి అది కూడా మహేష్ నడుచుకుంటూ వచ్చిందో అఫిషియల్ గా వదిలారు. మరి సినిమా కాన్సెప్ట్ టీజర్ ఎప్పుడు వస్తుందో చూడాలి.