వక్కతం వంశీ సినిమాకు రానా గ్రీన్ సిగ్నల్

SMTV Desk 2018-11-25 11:56:00  Vakkantham Vamshi, Rana Daggubati,

హైదరాబాద్, నవంబర్ 25: రైటర్ గా ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు కథలు అందించిన వక్కంతం వంశీ దర్శకుడిగా చేసిన మొదటి సినిమా నా పేరు సూర్య. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా చేసిన ఈ సినిమా అంచనాలను అందుకోవడంలో విఫలమైంది. రైటర్ గా హిట్ ట్రాక్ కొనసాగించిన వక్కంతం వంశీ డైరక్టర్ గా మొదటి సినిమా ఫ్లాప్ అందుకున్నాడు.

అందుకే అతనితో మరో సినిమా కోసం హీరోలు వెనుకాడుతున్నారు. వక్కంతం వంశీ మాత్రం రానా కోసం ఓ కథ సిద్ధం చేశాడట. రానాకు ఆల్రెడీ లైన్ వినిపించాడట. ఫుల్ స్క్రిప్ట్ సిద్ధం చేసుకురమ్మన్నాడని తెలుస్తుంది. నా పేరు సూర్య కథ మంచిదే కాని డీల్ చేయడం కుదరలేదు. రానా కథ మాత్రం పర్ఫెక్ట్ హిట్ టార్గెట్ తో రాసుకున్నాడట.

కథ బాగుంటే చాలు ఎలాంటి సినిమా అయినా చేసే రానా దగ్గుబాటి వక్కతం వంశీ సినిమాకు రానా గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. మరి ఈ సినిమా గురించి మిగతా డీటైల్స్ తెలియాల్సి ఉంది.