రెడ్ మీ నోట్ 6 ప్రో ప్రభంజనం

SMTV Desk 2018-11-24 19:04:06  red mi note 6 pro, 6 lakhs

హైదరాబాద్, నవంబర్ 24:రెడ్మీ ఫోన్స్.. బ్రహ్మాండమైన స్మార్ట్ ఫోన్లు బడ్జెట్ ధరకు దొరుకుతాయా? అని అనుకుంటున్న తరుణంలో మార్కెట్ లోకి దూసుకొచ్చాయి. అంతే.. నోట్ పేరుతో రిలీజ్ చేసిన మోడల్స్ సూపర్ హిట్. రెడ్మీ నోట్ 3 సూపర్ డూపర్ హిట్ కావడం.. లక్షల ఫోన్లను యూజర్లు కొనడంతో.. రెడ్మీ నోట్ 4, రెడ్మీ నోట్ 5, 5 ప్రో, రెడ్మీ నోట్ 6 ప్రో సిరీస్ లను లాంచ్ చేసింది కంపెనీ.

తాజాగా విడుదల చేసిన రెడ్ మీ నోట్ 6 ప్రో ఫోన్ ఫ్లాష్ సేల్ లో క్షణాల్లో 6 లక్షలకు పైగా ఫోన్లు అమ్ముడుపోయాయట. ఈ ఫోన్ కు విపరీతంగా డిమాండ్ పెరుగుతుండటంతో నిన్ననే మూడు సార్లు ఫ్లాష్ సేల్ ను నిర్వహించింది కంపెనీ. ఫ్లిప్ కార్ట్, ఎమ్ఐ.కామ్ లో ఈ ఫోన్ ను కొనుగోలు చేయొచ్చు. దీని ధర 13,999 రూపాయలు. అయితే.. దీనికి కొన్ని ఆఫర్లు కూడా ఉన్నాయి. ఈ ఫ్లాష్ సేల్స్ లో ఫోన్ ను కొనలేకపోయిన వారికి మరో అవకాశాన్ని త్వరలో ఇవ్వనున్నట్టు కంపెనీ ప్రకటించింది.