తీవ్ర ఒత్తిడిలో తెలంగాణ

SMTV Desk 2018-11-24 15:37:05  Telangana, RBI,

న్యూ ఢిల్లీ, నవంబర్ 24: రాష్ట్రాల ఆర్ధిక పరిస్థితులపై రిజర్వు బ్యాంకు అఫ్ ఇండియా ఆర్బీఐ వెలువరించిన తాజా నివేదికలో తెలుగు రాష్ట్రాలపై ఆసక్తికర గణాంకాలు వెలుగులోకి వచ్చాయి. రాష్ట్ర విభజన తర్వాత ధనిక రాష్ట్రంగా భావిస్తున్న తెలంగాణ ప్రస్తుతం అప్పుల్లో కూరుకుపోతుండగా… తీవ్ర ఆర్ధిక నష్టాలను దిగమింగుకుంటున్న ఆంధ్ర ప్రదేశ్ క్రమంగా అప్పులనుంచి బయటపడుతోంది అని తాజా సమాచారం . గత ఏడాది కాలంలో తెలంగాణ అప్పులు 9.5 శాతం పెరిగినట్టు ఆర్బీఐ వెల్లడించింది. 2017-18 ఆర్ధిక సంవత్సరంలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్‌డీపీ)పై అప్పు 22.2 శాతం పెరిగిందనీ… 2016-17 ఆర్ధిక సంవత్సరంలో ఇది 12.7 శాతంగా ఉందని ఆర్బీఐ పేర్కొంది.