ఏపి శాసనసభ సమావేశాలు ఆ రోజు నుండే

SMTV Desk 2018-11-24 12:46:57  AP Assembly, chandra Babu naidu

విజయవాడ, నవంబర్ 24: ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ శీతాకాల సమావేశాలు డిసెంబరు రెండో వారంలో నిర్వహించే అవకాశముంది. డిసెంబరు 10వ తేదీన దిల్లీలో భాజపాయేతర పార్టీల సమావేశం నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ సమావేశానికి హాజరవ్వాల్సి ఉన్నందున, 10 తర్వాత శాసనసభ సమావేశాలు నిర్వహించే అవకాశమున్నట్టు సమాచారం. సమావేశాలు ఎన్ని రోజులు జరపాలన్న విషయంలో ఇంకా ఇతమిత్థంగా వొక నిర్ణయానికి రాలేదు. రెండు రోజులపాటు సమావేశాలు నిర్వహించాలన్నది వొక ప్రతిపాదన. వచ్చే సమావేశాల్లోనే శాసన మండలి ఛైర్మన్‌ను కూడా ఎన్నుకోనున్నారు. మండలి ఛైర్మన్‌గా ఉన్న ఎన్‌ఎండీ ఫరూక్‌ను రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకోవడంతో ఆ స్థానం ఖాళీగా ఉంది.