అసెంబ్లీ రద్దు మన అదృష్టం : కోదండరాం

SMTV Desk 2018-11-23 19:25:38  kodandaram, kcr, assembly

హైదరాబాద్ , నవంబర్ 23: తెలంగాణ ఏర్పాటు విషయంలో సోనియాగాంధీ ఎంతో సాహసం చేశారని టీజేఎస్ అధినేత కోదండరామ్ చెప్పారు . గడిచిన నాలుగున్నరేళ్ల పాలనలో కేసీఆర్ చేసిందేమీలేదని మండిపడ్డారు. 9 నెలల ముందే అసెంబ్లీని కేసీఆర్ రద్దు చేయడం మనం చేసుకున్న అదృష్టమని చెప్పారు. ముందే గద్దె దిగిన కేసీఆర్ కు ఓట్లు అడిగే అర్హత కూడా లేదని ఎద్దేవా చేసారు. లక్ష ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన కేసీఆర్... అందులో పావువంతు ఉద్యోగాలను కూడా ఇవ్వలేదని విమర్శించారు. తెలంగాణ సాధన కోసం ఎంతో కష్టపడ్డామని చెప్పారు. ప్రజల కోసమే నిలబడతామని, ప్రజల కోసమే పని చేస్తామని అన్నారు. కేసీఆర్ కు ఓటేసినా ఫాంహౌస్ కే, ఓటు వేయకపోయినా ఫాంహౌస్ కే అని చురకలు అంటించాడు .