'జెర్సీ’ విడుదల తేదీ ఖరారు

SMTV Desk 2018-11-23 18:42:02  jercy, natural star nani,

హైదరాబాద్, నవంబర్ 23: న్యాచురల్ స్టార్ నాని నటిస్తున్న పిరియాడికల్ స్పోర్ట్స్ డ్రామా ‘జెర్సీ విడుదల తేదీ నిర్ణయించారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న సితార ఎంటెర్టైన్మెంట్స్ కొద్దీ సేపటి క్రితం ఈ రిలీజ్ డేట్ ను అధికారికంగా ప్రకటించారు . ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈచిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 19న విడుదలకానుంది.క్రికెట్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో నాని డిఫరెంట్ లుక్స్ తో కనిపించనున్నాడు. శ్రద్ధా శ్రీనాథ్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాకి అనిరుధ్ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు.

ఈ సినిమా కోసం నాని కొంతకాలం పాటు క్రికెట్ ఆటలో శిక్షణ తీసుకుని మరీ రంగంలోకి దిగాడు. ఈ సినిమా తన కెరియర్లో వైవిధ్యభరితమైనదిగా నిలుస్తుందని నాని బలంగా నమ్ముతున్నాడు. ఆయన నమ్మకాన్ని ఈ సినిమా ఎంతవరకూ నిలబెడుతుందో చూడాలి.