కిలో ఉల్లిగడ్డ ధర కేవలం రూ.1

SMTV Desk 2018-11-23 18:17:03  onions price, karnataka

బెంగుళూరు, నవంబర్ 23: సాధారణంగా కిలో ఉల్లిగడ్డ ధర ఎంతుంటుంది అంటే.. 20 రూపాయలు అని చెప్పొచ్చు. అయితే.. వొక్కోసారి ఉల్లిధరలు ఆకాశాన్ని అంటడం కూడా మనం చూశాం. 100 రూపాయలకు కిలో ఉల్లిగడ్డ అమ్మిన రోజులూ ఉన్నాయి. అయితే.. ఇప్పుడు మాత్రం ఉల్లిగడ్డ ధర పాతాళానికి తాకింది. అవును.. ఇప్పుడు కిలో ఉల్లిగడ్డ ధర ఎంతో తెలుసా? కేవలం రూపాయి. కర్ణాటకలో ఉల్లిగడ్డ ధరలు దారుణంగా పడిపోయాయి. కిలో ఉల్లిగడ్డను రూ.1కి విక్రయిస్తున్నారు. వారం కిందట క్వింటాలు ఉల్లిగడ్డ సంచి రూ.500లకు అమ్ముడుపోగా బుధవారం అదే సంచి రూ.100కు అమ్ముడుపోయింది. హూబ్లి, ధార్వాడ్, హవేరి, గడాగ్, బాగల్‌కోట్, బెల్గాం, చిత్రదుర్గ్ ప్రాంతాల్లోని హోల్‌సేల్ మార్కెట్లలో క్వింటాలు ఉల్లిగడ్డ రూ.100కు అమ్ముడుపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు