ట్రిపుల్ ఆర్ మూవీ నుండి ఫోటో లీక్

SMTV Desk 2018-11-23 17:56:06  RRR, rajamouli,

హైదరాబాద్, నవంబర్ 23: టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ట్రిపుల్ ఆర్ మూవీ భారీ మల్టీస్టారర్ గా రాబోతున్న సంగతి తెలిసిందే. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో ఎన్.టి.ఆర్, చరణ్ ఇద్దరు స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. ఈమధ్యనే సెట్స్ మీదకు వెళ్లిన ఈ సినిమా షూటింగ్ నుండి ఓ ఫోటో లీక్ అయ్యింది. బ్రిటీష్ కాలం నాటి సెట్ వొకటి ఆర్.ఆర్.ఆర్ నుండి లీక్ అయ్యింది.

రాజమౌళి తన ప్రతి సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు. ముఖ్యంగా లీకులు కాకుండా చిత్రయూనిట్ మొత్తాన్ని సెల్ ఫోన్స్ కూడా అవైడ్ చేసేలా కండీషన్స్ పెడతాడు. మరి ఎలా వచ్చిందో ఏమో కాని ఆర్.ఆర్.ఆర్ నుండి ఓ సెట్ ఫోటో లీక్ అయ్యింది. చూస్తుంటే అది కూడా భారీ స్థాయిలో ఉంది.

300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ట్రిపుల్ ఆర్ మూవీ బాహుబలి రేంజ్ సినిమాగా తీర్చిదిద్దబోతున్నాడు జక్కన్న. పిరియాడికల్ డ్రామాగా రాబోతున్న ఈ మూవీలో హీరోయిన్స్ విషయం ఇంకా ఫైనల్ కాలేదు.