నేడే సోనియా సభ..

SMTV Desk 2018-11-23 17:43:25  Sonia, Sonia Gandhi, telangana, Congress

హైదరాబాద్, నవంబర్ 23:తెలంగాణ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచుతోంది. ఇందులో భాగంగానే తెలంగాణ ఇచ్చిన తర్వాత తొలి సారి తెలంగాణకు వస్తున్న సోనియా గాంధీకి ఘన స్వాగతం పలుకనున్నారు. శుక్రవారం మేడ్చల్‌లో నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో సోనియా, రాహుల్‌ పాల్గొంటున్న సందర్భంగా తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇందుకుగాను మూడు లక్షలకు పైగా భారీ స్థాయిలో జనసమీకరణ చేయనున్నట్లు తెలుస్తోంది.