మలయాళ ఇండస్ట్రీలో ఎలాంటి సమస్యా లేదు

SMTV Desk 2018-11-23 17:03:51  Meetoo, mohan lal,

హైదరాబాద్, నవంబర్ 23: మీటు దెబ్బకు వివిధ చలన చిత్ర పరిశ్రమల్లో లుకలుకలు మొదలయ్యాయి. తెలుగు,హిందీ, తమిళ, మలయాళ రంగాలకు మీటు సెగలు తాకాయి . తెలుగులో శ్రీరెడ్డి రేపిన ప్రకంపనలు తమిళ చిత్ర పరిశ్రమకు పాకాయి. అక్కడ గాయని చిన్మయి కూడా ఈ విషయంపై తన గళమెత్తింది. ఇక బాలీవుడ్ విషయానికి వస్తే నటి తనూశ్రీ దత్తా నటుడు నానా పటేకర్‌పై మీటూ ఆరోపణలు చేసింది. దీంతో చాలా మంది వివిధ పరిశ్రమల్లో తమకు జరిగిన అన్యాయం గురించి ధైర్యంగా మీడియా ముందుకు వచ్చి చెప్తున్నారు.

ఈ ఉద్యమంతో బాలీవుడ్ నటులు నానా పటేకర్, అలోక్ నాథ్, దర్శకుడు సాజిద్ ఖాన్, సుభాష్ ఘయ్ వొప్పుకున్న సినిమాల నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.

తాజాగా ‘మీటూ పై మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ స్పందించారు. మీటూ ఉద్యమం కేవలం మూణ్ణాళ్ల ముచ్చటేనని అన్నారు. మలయాళ యాక్టర్స్‌ ఛారిటీ కార్యక్రమంలో పాల్గొనేందుకు మోహన్ లాల్ దుబాయ్ వెళ్ళారు. అక్కడ మీడియా మీటూపై తన స్పందనను కోరింది. మీటూ ఉద్యమంపై వ్యక్తిగతంగా తాను కామెంట్ చేయబోనని మోహన్ లాల్ స్పష్టం చేస్తూనే… ‘లైంగిక వేధింపులు అన్నవి ప్రతీచోటా వున్నాయి. ఇలాంటివి కేవలం సినిమా ఇండస్ట్రీలోనే వుంటాయి అనుకోవడం కరెక్ట్ కాదు. మలయాళ ఇండస్ట్రీలో ఎలాంటి సమస్యా లేదు. మీటూ ఆరోపణలు చేయడం ఇప్పుడు ఫ్యాషన్‌గా మారిపోయింది. ఇలాంటివి ఎక్కువకాలం నిలబడవు. ఇదంతా మూణ్ణాళ్ల ముచ్చటే.