కృష్ణవంశీ మళ్లీ ఫాంలోకి వస్తాడా ?

SMTV Desk 2018-11-23 15:36:32  Krishna Vamshi, tollywood, Marati remake

హైదరాబాద్, నవంబర్ 23: టాలీవుడ్ క్రియేటివ్ డైరక్టర్ గా వొకప్పుడు సూపర్ హిట్ సినిమాలను తీసిన కృష్ణవంశీ ఇప్పుడు వరుస ఫ్లాపులు చేస్తున్నాడు. చందమామ తర్వాత ఆయన హిట్టు కొట్టలేదని చెప్పాలి. దశాబ్ధం పైగా సినిమాలైతే చేస్తున్నాడు కాని కృష్ణవంశీకి లక్ మాత్రం కలిసి రావట్లేదు. లేటెస్ట్ గా కృష్ణవంశీ ఓ మరాఠి సినిమాను రీమేక్ చేస్తున్నట్టు తెలుస్తుంది. మరాఠిలో సూపర్ హిట్ అయిన నట సామ్రాట్ మూవీని తెలుగులో రీమేక్ చేస్తున్నాడట కృష్ణవంశీ.

మహేష్ మంజ్రేకర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో నానా పటేకర్ ప్రధాన పాత్రలో నటించాడు. ప్రముఖ నటుడు జీవితంలో ఎదుర్కున్న వొడిదుడుకులను ఈ సినిమాలో చూపించారు. 2016లో మరాఠీలో వచ్చి సూపర్ హిట్ కొట్టిన నట సామ్రాట్ మూవీ తెలుగు రీమేక్ బాధ్యతలను కృష్ణవంశీ తీసుకున్నాడు. నానా పటేకర్ పాత్రలో ప్రకాశ్ రాజ్ నటిస్తున్నాడని తెలుస్తుంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాతో అయినా కృష్ణవంశీ మళ్లీ ఫాంలోకి వస్తాడేమో చూడాలి.