ఛాన్స్ వస్తే అతనితో కలిసి నటించడానికి సిద్ధం

SMTV Desk 2018-11-23 12:43:25  malavika Nair, Vijay Devarakonda,

హైదరాబాద్, నవంబర్ 23: యువ హీరోల్లో వరుస విజయాలతో దూసుకెళ్తున్నటాలీవుడ్ స్టార్ విజయ్ దేవరకొండ నోటా ఫ్లాప్ తో కాస్త వెనుకపడ్డట్టు అనిపించినా ఇటీవల వచ్చిన టాక్సీవాలా సినిమాతో మళ్లీ హిట్ అందుకున్నాడు. ఈ సినిమా రెండు రోజుల్లోనే లాభాల బాట పట్టడం చూసి ఇండస్ట్రీ వాళ్లు షాక్ అవుతున్నారు. టాక్సీవాలా సినిమాలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసిన మాళవిక నాయర్ విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పుకొచ్చింది.

తెలుగులో తను నటించిన ఐదు సినిమాల్లో 3 సినిమాల్లో విజయ్ ఉన్నాడని అయితే తను నేను కలిసి జంటగా నటించలేదని చెప్పింది మాళవిక. ఇండస్ట్రీలో ఉన్న అతి తక్కువమంది స్నేహితులలో తను వొకడని. తన కెరియర్ గ్రాఫ్ చూసి తనకు సంతోషంగా ఉందని అన్నది మాళవిక. కెరియర్ లో తనకు ఎదురయ్యే ప్రతి సందర్భాన్ని ఎదుర్కుని అతను మరింత దృఢంగా మారుతున్నాడని మాళవిక నాయర్ చెప్పారు. ఛాన్స్ వస్తే అతనితో కలిసి నటించడానికి సిద్ధం అంటుంది అమ్మడు.