ఎస్వీ రంగారావు పాత్రకు 'నో' చెప్పిన మెగా హీరో

SMTV Desk 2018-11-23 10:51:38  Sv Ranga Rao, NTR Biopic, Mega Brother Nagababu

హైదరాబాద్, నవంబర్ 23: నట సింహం బాలకృష్ణ ప్రతిష్టాత్మకంగా చేస్తున్న ‘ఎన్టీఆర్ చిత్రంలో ప్రముఖ నటుడు ఎస్వీ రంగారావు పాత్రను పోషించే అవకాశం మెగాబ్రదర్‌ నాగబాబుకు వచ్చిందట. స్వయంగా దిగ్గజ దర్శకుడు క్రిష్ ఈ పాత్ర కోసం నాగబాబును కలిశారట.

కానీ నాగబాబు మాత్రం ఆ పాత్రను చేయడానికి నిరాకరించారని తెలుస్తోంది. అయితే ఆ నిరాకరణకు కారణం ఏమిటనేది మాత్రం తెలియలేదు. దీంతో ఎస్వీఆర్ పాత్రకు వేరొక నటుడిని చూసుకున్నారట క్రిష్. ఈ బయోపిక్ లో మొదటి భాగమైన ‘కథానాయకుడు వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదలకానుంది అని తెలిసిందే .