మలయాళం నటి ఫొటోలు లీక్‌

SMTV Desk 2017-07-24 17:10:06  heroine, bhaavana, malayaali, social media, photos, leak, viral, production exicutive

కేరళ, జూలై 24 : మళయాళీ హీరోయిన్ భావన వేధింపుల పర్వం కేసు విచారణలో ఉండగానే మరో కేసు బయటకు వచ్చింది. మరో మళయాళ నటి మైథిలి ఫొటోలను ఒక ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ ఏకంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ విషయం తెలిసిన వెంటనే ఆ నటి పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం... ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ కిరణ్ కుమార్ కు నటి మైథిలితో దాదాపు పదేళ్ళుగా పరిచయం ఉంది. అతడికి పెళ్లి అయిందనే విషయం దాచిపెట్టి ఆమెకు దగ్గరవ్వాలని ప్రయత్నించగా విషయం తెలిసిన ఆమె అతడిని దూరం పెట్టింది. దీంతో కిరణ్ కుమార్ ఆమెను ఫొటోలతో బ్లాక్ మెయిల్ చేయడం మొదలెట్టాడు. తాను కోరినంత డబ్బివ్వకపోతే ఈ ఫొటోలు నెట్ లో పెడతానంటూ బెదిరించాడు. ఆమె ఆ బెదిరింపులను లెక్క చేయకపోవడంతో ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇప్పుడు ఆ ఫోటోలు వైరల్ గా మారాయి. దీంతో నటి మైథిలి ఎర్నాకులం పోలీసులకు కంప్లయింట్ చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు సమాచారం.