6 రోజులు 32 నియోజక వర్గాలు

SMTV Desk 2018-11-22 15:30:33  KCR, telangana elections

హైదరాబాద్, నవంబర్ 22: తెరాస అధినేత, తెలంగాణ అపద్దర్మ్మ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో శరవేగంగా దూసుకేల్తున్నాడు. 6 రోజులు 32 నియోజక వర్గాలను టార్గెట్‌గా పెట్టుకున్న కేసీఆర్ ఆ దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నారు.

19 తేదీ మధ్యాహ్నం నుంచి ఆయన ప్రచారానికి దిగారు. ఈ మూడు రోజుల్లో ఖమ్మం, జనగామ, సిద్దిపేట, కరీంనగర్, సిరిసిల్ల, కామారెడ్డి, మహబూబ్ నగర్, నల్లగొండ, యాదాద్రి, మెదక్ తదితర జిల్లాలలో ప్రచారం చేశారు. నేడు ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో బహిరంగ సభల్లో పాల్గొననున్నారు.